E.G: డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని పేర్కొన్నారు.