GNTR: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో CSE మూడవ సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర వెంకట్ (నందివెలుగు నివాసి) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం క్లాస్ మధ్యలో బయటకు వచ్చిన విద్యార్థి, క్యాంపస్ టాయిలెట్స్‌లో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.