SKLM: రూరల్ మండలం పాత్రుని వలస సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, హైవే సిబ్బంది ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు.