కృష్ణా: ఉంగుటూరులోని అత్కూరు గ్రామస్థులు తాగునీటి సరఫరా కేంద్రం వద్ద నెలకొన్న అపరిశుభ్రతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీటిని నియంత్రించే కంట్రోల్ వాల్వ్ చుట్టూ పాకుడు అధికంగా పేరుకుపోవడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య నిర్వహణ లోపించడంపై అధికారుల తీరును తప్పుబడుతున్నారు. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.