కోనసీమ: ఇటీవల కాకినాడలో ద్రోణ బ్యాట్మెంటన్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచిన రావులపాలెం హైస్కూల్ విద్యార్థులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం అభినందించారు. విద్యార్థుల వివరాలు తెలుసుకొని వారు మరింత ఉన్నతంగా రాణించాలని అభిలాషించారు. ప్రతిభావంతులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.