CTR: పుంగనూరు మండలంలోని పాలెంపల్లిలో వ్యవసాయ పొలం వద్ద భూ వివాదంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో హరికృష్ణారెడ్డి, భారతి ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు సమాచారం తెలిపారు. ఈ ఘర్షణపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారాయుడు గురువారం రాత్రి తెలిపారు.