NLR: గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్టు పనులు 2026 ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. శనివారం పోర్టును పరిశీలించిన ఆయన ఇప్పటివరకు రూ.4,900 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో రూ.2,002 కోట్లతో 71 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన పనులను వచ్చే ఏడాది ఏప్రిల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడమే చెప్పారు.