ATP: కళ్యాణదుర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కురుబ దొణస్వామి, వేపలపర్తి ఎంపీటీసీ నాగభూషణ, కనుకూరు రవి, పోలేపల్లి తిమ్మప్ప తదితరులు బుధవారం టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పసుపు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.