NTR: పెనుగంచిప్రోలు (మ) ముండ్లపాడు అడ్డరోడ్డులోని శ్రీ కాలభైరవ ఆలయంలో కూడా చోరీ జరిగినట్లు ఆలయ నిర్వహకులు పూర్ణచంద్రరావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఆలయంలో అభిషేకాలు నిర్వహించేందుకు ఆలయానికి వెళ్లి చూడగా తాళాలు పగులకొట్టి ఉండటంతో పాటు హుండీలోని డబ్బులు మాయమయ్యాని చెప్పారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరుస చోరీ ఘటనలతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.