ప్రకాశం: మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఒంగోలు వాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పోలీసు అధికారులు దాడులు నిర్వహించినప్పటికీ నిర్వాహకుల తీరులో మార్పు రావటం లేదని పేర్కొన్నారు. ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకుడిపై ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాస్ రావు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలను అదుపులోకి తీసుకున్నారు.