కడప: బద్వేల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధిలో రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పట్టణంలో వరుసగా బైక్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.