ASR: పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరికీ పార్టీ గుర్తింపునిస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. శనివారం హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన వైసీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన వైసీపీ పార్టీ మండల అధ్యక్షులను సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.