ASR: ముంచంగిపుట్టు మండలం బరోడా సమీపంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మొక్కలు పంపిణీ చేసే వాహనం, అంటబొంగు సమీపంలో గల పెట్పూలేడి ఘాట్ వద్ద రహదారి పై ఉన్న పశువులు, మేకలను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో అంటబొంగు గ్రామ రైతులకు చెందిన 3ఆవులు, 9మేకలు మృతి చెందాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.