CTR: పులిచెర్ల మండలం కావేటిగారిపల్లి పంచాయతీలో సోమవారం ఉదయం 9 గంటలకు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. మల్లేశ్వరకొండపై వెలిసిన ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధిపై నాయకులతో చల్లా చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని తెలిపారు.