KDP: వేంపల్లెలో శ్రీకృష్ణదేవరాయలు 496వ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ.. 500 ఏళ్ల కిందటే తెలుగు భాషను కీర్తించి గొప్ప మహనీయుడు దేవరాయులు అని కొనియాడారు. తన ఆస్థానంలో 8 మంది తెలుగు కవులకు చోటు ఇచ్చి అష్టదిగ్గజాలుగా కీర్తించారని చెప్పారు.