విశాఖ: వాల్తేరు తాత్కాలిక డీఆర్ఎమ్గా మనోజ్ కుమార్ సాహు నియమితులయ్యారు. గత డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ఇటీవల లంచం తీసుకోగా సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ కుమార్ సహనం తాత్కాలిక డీఆర్ఎంగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.