ASR: పాడేరు మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ రిఫ్రాక్షనిస్ట్ పోస్టు నియామకాల్లో అక్రమాలు జరిగాయని చక్రవర్తి అనే యువకుడు ఆరోపించాడు. మెరిట్ లిస్టులో తన పేరున్నా, లంచం ఇవ్వలేదని తక్కువ మెరిట్ ఉన్నవారికి పోస్ట్ ఇచ్చారని వాపోయాడు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యాడు.