బాపట్ల: కర్లపాలెం మండల కేంద్రంలో జాతీయ రహదారి వెంబడి అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో మురుగునీరు గృహాల ముందుకు చేరి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో గృహాల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నీరు రహదారిపైకి చేరడంతో దోమలు అధికమవుతున్నాయని వాపోతున్నారు.