KRNL: మద్దికేరకు చెందిన పారా అథ్లెట్ శివానిని బీజేపీ పత్తికొండ నియోజకవర్గ ఇంఛార్జ్ గోవర్దన్ శనివారం ఘనంగా సన్మానించారు. దివ్యాంగురాలైనా ఆత్మస్థైర్యంతో ప్రతిభ చూపిన శివాని ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్‌ను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. శివాని కుటుంబానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని గోవర్దన్ తెలిపారు.