ప్రకాశం: తర్లుపాడు మండలంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంత లక్ష్మి బుధవారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న 9 మందికి రూ. 7,23,191ల సహాయనిధి చెక్కులను ఆమె అందజేశారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని మరిచిపోరాదని వసంతలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.