పెద్దపల్లి పట్టణంలోని 13,14,32, 33 వార్డులో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రమణారావు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ, శంకుస్థాపన చేసి శుక్రవారం ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేరిస్తుందని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. పట్టణంలో నూతన బస్సు డిపో, బైపాస్ రోడ్లు, ఆసుపత్రి ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు.