కృష్ణా: రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కామినేని పుట్టిన రోజును పురస్కరించుకుని జనసేన నాయకుడు హోప్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం కలిదిండి మండలం ఎస్ఆర్పి అగ్రహారంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.