విశాఖ: సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవం సందర్భంగ బుధవారం విశాఖ బీచ్ రోడ్డులో ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ చాటారని వారు కొనియాడారు. దేశ సమగ్రత, ఐకత్యకు పటేల్ చేసిన కృషి మరువలేనిదన్నారు.