ELR: తివాచీ పరిశ్రమకు చెందిన పలువురు కార్మికులు మంత్రి మనోహర్‌తో బుధవారం భేటీ అయ్యారు. తివాచీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని మంత్రికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో తివాచీ డిజైన్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తివాచీ కార్మికుల సమస్యలపై మంత్రివర్గంలో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.