AKP: నాతవరం మండలం తాండవ జంక్షన్లో అక్రమంగా ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి ఆరు కేజీల గంజాయి స్వాధీన పరుచుకొని రిమాండ్‌కి తరలించామని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ చెప్పారు. నాతవరం ఎస్సై భీమరాజుకు ముందస్తు సమాచారంతో బస్సుని ఆపడంతో నిందితులు పారిపోతుండగా సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు.