ATP: బత్తలపల్లిలోని RDT స్పోర్ట్స్ సెంటర్లో రేపు జిల్లా స్థాయి సబ్ జూనియర్ రగ్బీ పోటీలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, డైరెక్టర్ కె. రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2009 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.