KDP: చాపాడు సమీపంలోని కుందూ నదిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ఇటీవల ప్రొద్దుటూరులో కిడ్నాప్‌కు గురైన వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి మృతదేహమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోలీసులు ఇప్పటికే బయటికి వెలికి తీశారు. వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన తర్వాత నదిలో పడేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది.