కృష్ణా: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం వారాహి చండి మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాయజ్ఞం జూలై 2, 3 తేదీల్లో కొనసాగనుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.