ATP: పెద్దపప్పూరు మండలంలోని జూటూరు-కోమలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై GRP పోలీసులు విచారణ చేపట్టారు.