కృష్ణా: ఇబ్రహీంపట్నంలో గతేడాది కృష్ణా నది వరదల్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఏపీసీపీడీసీఎల్ లైన్మెన్ కోటేశ్వరరావు కుటుంబానికి బ్యాంక్ అధికారులు రూ.28లక్షల బీమా చెక్కును అందజేశారు. డివిజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుడి భార్య మాధవీలతకు బ్యాంక్ మేనేజర్ మునీర్, ఏపీసీపీడీసీఎల్ డీఈ వసంతరావు చెక్కు అందించారు.