ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో ఆదివారం తెలుగు భాష మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతిని పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ రామ్మోహన్, కోశాధికారి జన్నే కుల్లాయి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి గురజాడ అప్పారావు అని పేర్కొన్నారు.