VSP: విశాఖ జీవీఎంసీ పరిధిలోని శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జోన్ 3, 5, 8 పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. నరవ నుంచి టీఎస్ఆర్కు వచ్చే ప్రధాన పంపు హౌస్లో మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ మురళీకృష్ణ తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.