KDP: రాబోయే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా శుక్రవారం కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.