అల్లూరి: పెదబయలు మండలం, లింగేటి పంచాయతీ వనకొత్తూరులో డ్రైనేజీ లేక, కొండల నుండి వచ్చే వరదతో రోడ్లు చిత్తడిగా మారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం TRF జిల్లా ఛైర్మన్ సతీష్ కుమార్ పోయిబరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపి, వెంటనే 300 మీటర్ల డ్రైనేజీ కాలువ నిర్మించి సమస్యను పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.