BPT: బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు పంచాయతీ పరిధిలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో శుక్రవారం ఒకరు మృతి చెందారు. ఎస్సై నాగరాజు వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లా చునార్ గ్రామానికి చెందిన రాకేష్ కుమార్(30) గ్రానైట్ ముడి రాయిని ఎత్తే సమయంలో క్రేన్ గొలుసు తెగి మీద పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.