SKLM: శ్రీకాకుళం పట్టణంలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి, సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ ప్రజాదర్బార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.