అన్నమయ్య: మన రాయలసీమ ప్రాంతంలో గత వైభవాన్ని చాటే చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తవ్వించినట్లు చరిత్ర చెప్పే మైదుకూరు ఎర్రచెరువు విశిష్టత అపారం. ఈ చెరువు నిండితే ఈ సమీప సుమారు 16పల్లెలకు పైగా పల్లెల్లో భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎర్ర చెరువుకు కృష్ణా జలాలను నింపేచర్యలు చేపట్టారు.