NDL: ఆత్మకూరు పట్టణ సీఐ రాముకు CMO కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. మొంథా తుఫాన్ వల్ల ప్రజల భద్రతపై ఆయన ముందస్తు అప్రమత్తమై తమ బృందంతో విధుల పట్ల అంకితభావంతో పనిచేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సమర్థమైన నిర్వహణను గుర్తించి సీఎం చేతుల మీదుగా గౌరవ సత్కారం చేయాలని నిర్ణయించడం, ఆయన శ్రమకు దక్కిన నిజమైన గుర్తింపు అని స్థానిక ప్రజలు తెలిపారు.