VZM: డెంకాడ మండలం పినతాడివాడలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్చాంధ్ర సాధనకు కలిసికట్టుగా కృషి చేస్తామని సభికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన అవగాహనా ర్యాలీలో పాల్గొన్నారు.