W.G: తణుకు మున్సిపల్ పాఠశాల నుంచి స్కేటింగ్ రింక్‌లో జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు సోమవారం తణుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించాలని కోరుతూ క్రీడాకారులను, కోచ్ లావణ్య, చందులను అభినందించారు.