E.G: జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో రాజానగరంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన ఉద్యోగమేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరిచంద్రప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పెరుమాళరావు శనివారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో మూడు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. వివరాలకు నెంబర్9988853335 ద్వారా సంప్రదించాలన్నారు.