NDL: కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో బుధవారం భారీ వర్షం పడటంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. దుద్యాల గ్రామం వద్ద పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సంగమేశ్వరం క్షేత్రానికి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే జయ సూర్య పెద్దవాగు ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు.