కోనసీమ: అమలాపురం మండలం ఇందుపల్లిలో ఆదివారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను డీఆర్వో మాధవి అందజేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. ప్రభుత్వం రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తుందని, వీటిలో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దివాకర్, సర్పంచ్ శివాలిని, తదితరులు పాల్గొన్నారు.