CTR: శాంతిపురం (M) మఠం పంచాయతీ సంతూరు గ్రామానికి చెందిన ఆనందప్ప భార్య గంగమ్మ (40) ప్రమాదవశాత్తు హంద్రీనీవా కాలువలో పడి మృతి చెందింది. బట్టలు ఉతికేందుకు వెళ్లి, హంద్రీనీవా కాలువలో కాలుజారి పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.