ELR: పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పలు గ్రామాలకు చెందిన ప్రజలు కలిశారు. అనంతరం ఎమ్మెల్యే వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ క్రమంలో వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు.