కృష్ణా: మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాదర్బార్లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందజేయాలన్నారు.