SKLM: రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన సురక్షిత త్రాగునీరు అందించేందుకు అప్పటి సీఎం జగనన్న జలజీవన్ మిషన్‌కు నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వారి ఆ సమర్థతను జగన్ మీదకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.