NTR: ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వాహనాల్లో తప్పనిసరిగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని రవాణా కమిషనర్ మోహన్ శుక్రవారం తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు.