నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొని జయభేరి మోగిస్తుందని ఎంపీ మిధున్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మాజీమంత్రి కాకాని నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.