కోనసీమ: కొత్తపేట మండల పరిసర ప్రాంతాల్లో దీపావళి మందు గుండు సామాగ్రి తయారీ కేంద్రాలు, అమ్మకం షాపులపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ RDO కొత్త పేట శ్రీకర్ బుధవారం రాత్రి తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. అనంతరం మందు సామాగ్రి నిల్వ ఉంచిన చోట తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.